ఇస్లాం కేంద్ర బిందువుగా వెలువడిన విస్తృతరమైన, వైవిధ్యభరితమైన, ఇస్లామీయ ధార్మిక సాహిత్యం శాఖోపశాఖలుగా వ్యాపించి ఉంది. సర్వసృష్టికర్త, సమస్త విశ్వానికి ప్రభువు, అందరి పోషకుడు, అయిన అల్లాహ్ నిర్దేశించిన మహత్తర భావనలు, నీతి నియమాలు, బోధనలు, ఆదేశాలు, ప్రమాణాలు ప్రాతిపదికగా పుంఖాను పుంఖాలుగా వెలువడిన ఇస్లామీయ సాహిత్యాన్ని తెలుగులో విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యతను గుర్తించి ఉనికిలోకి వచ్చిన ప్రచురణల సంస్థ తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్.