 |
| |
|
| |
|
 |
ఇస్లామీయ సాహిత్య బాండాగారం అపారమైనది. కొన్ని లక్షల పేజీల అక్షర సంపదకు నెలవైన లువడిన విస్తృతరమైన, వైవిధ్యభరితమైన, ఇస్లామీయ ధార్మిక సాహిత్యం శాఖోపశాఖలుగా వ్యాపించి ఉంది. సర్వసృష్టికర్త, సమస్తవిశ్వానికి ప్రభువు, అందరి పోషకుడు, అయిన అల్లాహ్ నిర్దేశించిన మహత్తర భావనలు, నీతి నియమాలు, బోధనలు, ఆదేశాలు, విలువలు, ప్రమాణాలు ప్రాతిపదికగా పుంఖానుపుంఖాలుగా వెలువడిన ఇస్లామీయ సాహిత్యాన్ని తెలుగులో విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యతను గుర్తించి ఉనికిలోకి వచ్చిన ప్రచురణల సంస్థ తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్. |
| |
|
దివ్యఖుర్ఆన్ ఆడియో కేసెట్ల పరంపరలో మొదట 30వ భాగం – పారయె అమ్ కేసెట్- ను విడుదల చేసింది. అనంత కరుణామయుడైన అల్లాహ్ దయవల్ల తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ దివ్యఖుర్ఆన్ తెలుగు అనువాదంతో పాటు, మహాప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచనాలను, ఇస్లాంను పరిచయం చేసే పుస్తకాలను, ఇస్లాం పట్ల గల అపార్ధాలను తొలగించే మహోపయుక్తమైన గ్రంథాలను, ఇస్లామీయ జీవన విధానాలను గురించి ముస్లిం సోదరులలోను, ముస్లిమేతర సోదరులలోను తలయెత్తే రకరకాల సందేహాలను నివృత్తి చేసే ప్రశ్నోత్తర సంపుటం మొదలు నమాజ్ కు సంబంధించి విధి విధానాలను వివరించే పుస్తకాల వరకు తేటతెలుగులో విభిన్న రంగాలకు చెందిన రచనలను వెలువరించింది. వాటిలో అరబీ, ఉర్దూ, ఆంగ్లం, తమిళం వంటి భాషల నుంచి చేసిన అనువాదాలు, తెలుగులో రచించిన మౌలిక గ్రంథాలు ఉన్నాయి.
|
| |
|
 |
తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ధర్మసేవలో చేస్తున్న ఈ కృషికి చేదోడువాదోడు అవసరం. మాప్రచురణలు ఆదరంతో చదవండి. లోటుపాట్లు ఏవైనా ఉంటే నిర్మొహమాటంగా వ్రాయండి. మీ సూచనలు, అభిప్రాయాలు మాకు ఎంతో అవసరం. మాపుస్తకాల జాబితాను మా ప్రచురణలులో చూడండి. మా పబ్లికేషన్స్ నుంచి పుస్తకాలు, వి.పి.పి ద్వారా పొందగోరేవారు, ఆర్డర్ తో పాటు సగం పైకాన్ని మనీ ఆర్డర్ లేదా డిమాండ్ డ్రాప్ట్ ద్వారా - తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ – పేర పంపగలరు. మీకు కావలసిన పుస్తకాల పేర్లు, పోస్టల్ అడ్రసు, పిన్ కోడ్ తో సహ వివరంగా వ్రాయగలరు. |
|
|
|