తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ – 1977వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి అంకిత భావంతో, నిర్ధిష్ట ఆశయ సాధనాదిశగా అడుగులు వేస్తోంది. తన పయనంలో ఎన్నో మైలురాళ్ళను దాటుకుని ముందుకు వచ్చింది.
1977వ సంవత్సరంలో మొదలైన ఈ సంస్థ అల్లాహ్ దయవల్ల ఎన్నో విజయాలు సాధించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 1979వ సంవత్సరంలో గీటురాయి వారపత్రిక ప్రారంభించింది. ఇస్లాం పట్ల ముస్లిముల పట్ల సమాజంలో పాదు కున్న అనేక అపార్ధాలను దూరం చేస్తూ ఇస్లాం వాస్తవికతను పరిచయం చేస్తున్న ఈ పత్రికను ప్రతివారం దాదాపు 25వేల మంది పాఠకులు చదువు తున్నారు. హిందూ, ముస్లిముల ఐక్యతకు వారధిగా పనిచేస్తున్న ఈ పత్రికను అనేక మంది ప్రముఖ భాషావేత్తలు, పత్రికా ప్రముఖులు కొనియాడారు.
- ఖుర్ఆన్, ప్రవక్త (స) సంప్రదాయాలు, లేకుండా ఎలాంటి ఇస్లామీయ ఉద్యమం ముందుకు సాగజాలదు. కాబట్టి సంస్థ మొదలైన కొద్ది సంవత్సరాలలోనే, దివ్యఖుర్ఆన్ గ్రంథాన్ని తెలుగులో అనువదించింది. 1981లో ఈ దివ్యగ్రంథాన్ని ఆవిష్కరించింది. చక్కని వ్యావహారిక శైలిలో ఉన్న ఖుర్ఆన్ గ్రంథం ఎన్నోసార్లు ప్రచురింపబడి, వేల కాపీలు ప్రజానీకానికి అందించడం జరిగింది.
- దివ్యఖుర్ఆన్, ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచనాలు, ఆయన (స) జీవిత చరిత్రతో పాటు దైనందిన జీవితంతో ముడిపడిన అనేక అంశాలపై ప్రస్తుతానికి 190 పుస్త కాలను ప్రచురించడం జరిగింది. అంతేగాక సందేశ ప్రచారానికి గాను అందరికి అందుబాటులో ఉండేలా 20 అంశాలపై ఫోల్డర్లను ముద్రించడం జరిగింది.
- ఇస్లాం సందేశాన్ని సర్వసామాన్యం చేయడానికి ఉచిత పోస్టల్ లైబ్రరీ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడింది. ఇప్పటి వరకు 9300 మంది పాఠకులు లైబ్రరీ సభ్యులుగా చేరారు.
- ముస్లిమేతర సోదరులకు ఇస్లాం సందేశాన్ని చేరవేయడానికి ఖుర్ఆన్ అవగా హనా పాఠాలు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
- సంస్థ ప్రచురణలు ప్రచురించడానికి ఓ ఆధునాతన ఆఫ్ సెట్ ప్రెస్ ను నెలకొల్ప డం జరిగింది.
- వివిధ కార్యక్రమాలు సజావుగా సాగడానికి అన్ని సౌకర్యాలతో కూడిన భవన సముదాయాన్ని నిర్మించడం జరిగింది. సంస్థ కార్యాలయంతో పాటు కార్యకర్త లకు గృహవసతి సౌకర్యం కల్పించబడింది.
|




|