తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ - 1977వ సంవత్సరంలో ప్రారంభమయ్యింది. అప్పటి నుంచి అంకిత భావంతో  నిర్దిష్ట ఆశయ దిశగా అడుగులు వేస్తోంది. తన పయనంలో ఎన్నో మైలురాళ్ళను దాటుకుని ముందుకు వచ్చింది.
దివ్యఖుర్ఆన్ ఆడియో కేసెట్ల పరంపరలో మొదట 30వ భాగం పార- యె అమ్ కేసెట్ విడుదల చేసింది. అనంత దయామయుడైన అల్లాహ్ దయ వల్ల  తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ దివ్యఖుర్ఆన్ తెలుగు అనువాదంతో పాటు మహాప్రక్త ముహమ్మద్ (స) ప్రవచనాలను, ఇస్లామ్ పరిచయం చేసే పుస్తకాలను, ఇస్లాం పట్లగల అపార్థాలను తొలగించే మహోపయుక్తమైన గ్రంథాలను, ఇస్లామీయ జీవన విధానాలను గురించి ముస్లిం సోదరులలోను,
ఇస్లామీయ సాహిత్య బాండాగారం అపారమైనది. కొన్ని లక్షల పేజీల అక్షర సంపదకు నెలవైన లువడిన విస్తృతరమైన, వైవిధ్యభరితమైన, ఇస్లామీయ ధార్మిక సాహిత్యం శాఖోపశాఖలుగా వ్యాపించి ఉంది. సర్వసృష్టికర్త, సమస్తవిశ్వానికి ప్రభువు, అందరి పోషకుడు, అయిన అల్లాహ్ నిర్దేశించిన మహత్తర భావనలు, నీతి నియమాలు, బోధనలు, ఆదేశాలు, విలువలు, ప్రమాణాలు ప్రాతిపదికగా పుంఖానుపుంఖాలుగా వెలువడిన ఇస్లామీయ సాహిత్యాన్ని తెలుగులో విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యతను గుర్తించి ఉనికిలోకి వచ్చిన ప్రచురణల సంస్థ తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్.
 

The Web teluguislamiclit.org
 
 
All right reserved 2007-08 teluguislamiclit.org