KANTHI REKHA

 

బుక్ షాప్ ఆన్ వీల్స్
తెలుగులో అత్యధిక సంఖ్యలో ఇస్లామీయ సాహిత్యాన్ని ప్రచురించిన సంస్థ – తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ – ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో తెలుగు, ఇంగ్లీష్, హింది, ఉర్దూ భాషలు వాడుకలో ఉన్నాయి. చివరకు చిన్న చిన్న గ్రామాలలోను నేడు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు వాడబడుతున్నాయి. ఆయాభాషల్లో ఇస్లామీయ సాహిత్యాన్నిప్రజల వాకిట అందించడానికి ఉద్దేశించినది – బుక్ షాప్ ఆన్ వీల్స్ – కార్యక్రమం. ఒక మోటారు వాహనంలో పుస్తకాలను తీసుకుని, ప్రజల వద్దకు ఊరూరా, వాడవాడకూ, ఇస్లామీయ సాహిత్యాన్ని చేరవేయడం లక్షంగా ఏర్పటయ్యింది – బుక్ షాప్ ఆన్ వీల్స్ – దీని ద్వారా ప్రజలందరి వద్దకు ఇస్లామీయ సాహిత్యాన్ని, ఇస్లామీయ బోధనల సారాంశాన్ని అందించవచ్చు. ఈ వాహనం ద్వారా కరపత్రాలు, పాంప్లేట్లు, హాండ్ బిల్లులు వగైరాలను ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా ఇస్లామీయ బోధనలను క్లుప్తంగా ప్రజలకు పరిచయం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే వివిధ జాతరలు, పుష్కరాలు, పండుగలు, బుక్ ఫెయిర్లు, ఉర్సులు తదిదర సందర్భాల్లో ప్రజలు లక్షలాదిగా సమావేశమయ్యే సందర్భాలలో, ఎగ్జిబిషన్లు, బాజారులు వగైరాలు ఏర్పాటు చేసినప్పుడు, బుక్ షాప్ ఆన్ వీల్స్ ద్వారా ఆయా స్థలాలకు చేరుకొని, పెద్ద సంఖ్యలో ప్రజలకు ఇస్లామీయ సాహిత్యాన్ని పరిచయం చేయడం, ఇస్లామీయ బోధనలను వారికి తెలియజేయడం సుసాధ్యమవుతుంది.      

బుక్ షాప్ ఆన్ వీల్స్
    11
Mar. 2009
Chittoor & Nellore districts
 30

All right reserved 2007-08 teluguislamiclit.org