హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత ఉన్న నగరం. ఇస్లామీయ సాహిత్యం, ఇస్లామీయ సంస్కృతీ సభ్యతలకు హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ వచ్చింది. భారతదేశం అంతటినీ ప్రభావితం చేసిన అనేక ఉద్యమాలకు జన్మస్థానంగా ప్రత్యేకతను సంతరించుకుంది.  అనేక మంది ప్రముఖులకు, సంస్కర్తలకు, మేధావులకు, పుట్టినిల్లు హైదరాబాద్.
ఆధునిక కాలంలో హైదరాబాద్ హైటెక్ సిటీగా పేరెన్నిక గన్నది. ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ ద్వారా జ్ఞాన విజ్ఞానాలు ఎల్లెడలా వ్యాప్తి చెందే అవకాశం నేడు లభించింది. ఇస్లామీయ బోధనలు, ఇస్లామీయ సందేశాన్ని ప్రజలు మాట్లాడే భాషలోనే అందించాలన్నది ఎవరూ కాదనలేని యదార్థం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ బయట వివిధ రాష్ట్రాలలోను, విదేశాల లోనూ దాదాపు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. ఇస్లామీయ సాహిత్యం అరబీ, ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీషు తదితర భాషల్లో అపారంగా ఉన్నప్పటికీ తెలుగులో ఇస్లా మీయ సాహిత్యం చాలా తక్కువగా ఉంది.
 
   
తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ఈ కొరతను తీర్చడానికి నడుం బిగించింది. చక్కని వ్యవహారిక తెలుగులో, సులభమైన శైలిలో, సరళమైన భాషలో తెలుగు పాఠకులకు ఇస్లా మీయ బోధనలు, ఇస్లామీయ సందేశం అందించాలన్న లక్ష్యంతో తెలుగు ఇస్లామిక్ పబ్లికే షన్స్ పనిచేస్తుంది. భారతదేశ చరిత్రలో ఇస్లామీయ సాహిత్యాన్ని తెలుగు భాషలో ఒక ఉద్య మంగా  ప్రచురించడం ప్రారంభించిన సంస్థ తెలుగు ఇస్లామిక్ పబ్లి కేషన్స్. హైదరాబాద్ పాత నగరంలో, చత్తాబజార్ ప్రాంతంలో, సాలార్ జంగ్ మ్యూజియానికి వెనుక భాగాన నిర్మించిన  -- సందేశ భవనం – కేంద్రంగా తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ప్రచురణల కార్యక్రమాలు కొనసా గుతున్నాయి.
 
ప్రచురణలకు గాను ఒక అధునాతన మైన ఆఫ్ సెట్ ప్రింటింగ్ మిషన్, ప్లేట్ మేకింగ్ సదుపా యంతో పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిబ్బందికి ఈ భవనంలో గృహవసతి కల్పించి పబ్లికేషన్ను ఒక ఉద్యమంగా కొనసాగించడం జరుగుతుంది. ప్రచురణల కోసం ఒక అధునాతనమైన కంప్యూటర్ డి.టి.పి సదుపాయం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటీవల ఒక వాహనాన్ని సమకూర్చుకుని, పుస్తకాలను – బుక్ షాప్ ఆన్ వీల్స్- ద్వారా ప్రజలందరి వాకిట తీసుకువెళ్ళడానికి ఇస్లామీయ సందేశాన్ని, ఇస్లామీయ బోధనలను, అందరికీ చేర వేయడానికి ఏర్పాట్లు చేసుకుంది.
సమాజంలో వివిధ మతవర్గాల మధ్య సామరస్యాన్ని పెంచడానికి, ఒకరినొకరు అర్ధం చేసుకుని అవగాహన పెంచుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, అపార్ధాలు తొలగిస్తూ, సహిష్ణుత, సామరస్యాలు పెంచడానికి తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ చేస్తున్న ఈ కృషికి అందరి తోడ్పాటు, చేయూత ఎంతైనా అవసరం.

The Web teluguislamiclit.org
 
   
All right reserved 2007-08 teluguislamiclit.org