ముస్లిమేతర ప్రజలకు ఇస్లాం సందేశాన్ని పరిచయం చేయడానికి – తెలుగు  ఇస్లామిక్ పబ్లికేషన్స్ – వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రయత్నిస్తోంది. అలాంటి కార్యక్రమాల్లో ముస్లిమే తర ప్రముఖులకు ఇస్లాం పరచయం కూడా ఒకటి. వివిధ వర్గాల మధ్య సామరస్యం, సౌభ్రాతభావం, సహిష్ణుతలను పెంపొందించడానికి ఉద్దేశించినవే ఈ కార్యక్రమాలు. ఇస్లాం గురించి ముస్లిముల గురించి ప్రచారంలో ఉన్న అనుమానాలు, అపోహలు, అపా ర్ధాలను దూరం చేసి, ఇస్లాం వాస్తవికతను వారికి పరిచయం చేయడానికే ఈ కార్యక్ర మాలు చేప్పట్టడం జరిగింది.
   
ఈ సందర్భంగా ముస్లిమేతర ప్రముఖుల్లో, ముఖ్యంగా పాలనాయంత్రాంగం, పోలీసు యంత్రాంగం, తదితర విభాగాల్లోని ముఖ్య అధికారులకు, సమాజంలో పలుకుబడి కలిగిన పెద్దలకు ఇస్లాం గురించి తెలియజేసే సాహిత్యాన్ని పంపిణీ చేయడం ద్వారా సమాజంలో ఇస్లాం గురించి చక్కని అవగాహన కలిగిం చవచ్చు. ఎందుకంటే, సమాజంలో కీలకపాత్ర పోషించే ఈ ప్రముఖులకు ఇస్లాం పరిచ యం చేయడం ద్వారా ఇస్లాం గురించి ప్రచారంలో ఉన్న అపార్థాలు, అపోహలు, తొలగిం చడం తేలికవుతుంది. ఈ విధంగా మతసామరస్యం, సహజీవన భావాలను పెంపోందిం చవచ్చు.
   
తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ఈ ఉద్దేశ్యంతో దివ్యఖుర్ఆన్ తెలుగు అనువాదం తో సహ అనేక ఇస్లామీయ  బోధనల పుస్తకాలను ఈ ప్రముఖులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దాదాపు 500 రూపాయలు విలువ కలిగిన పుస్తకాల సెట్లను పంపిణీకి ఎన్నుకోవడం జరిగింది. ఇలాంటి 4000 సెట్టులను పంపిణీ చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఈ ప్రాజెక్టు దేవుని దయవలన మంచి ఫలితాలను సాధిస్తుందని, సమాజంలో సామరస్యం, సోదరభావం, సహజీవన భావాలను పెంపొందిస్తుందని మా విశ్వాసం. ఈ మంచి కార్యక్రమానికి మాతో సారూప్యభావాలు కలిగిన వారు, సమాజహితం, శాంతి శ్రేయాలు అభిలషించేవారు తమ చేయూతనిచ్చి ప్రోత్సహిస్తారన్న నమ్మకం మాకుంది.  
 

The Web teluguislamiclit.org
 
 
All right reserved 2007-08 teluguislamiclit.org